MLA Rakesh Reddy | అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు.. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
MLA Rakesh Reddy | కామారెడ్డి : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని సస్యశ్యామల దేశంగా తీర్చి దిద్దుతున్న వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు.
11 సంవత్సరాలుగా దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకుంటున్నాయని అన్నారు. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా రామజన్మ భూమిని నిర్మించాడని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని గ్రామాలకు 90% నిధులను మంజూరు చేసి రోడ్లను వేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం కి చరమగీతం పాడి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న 22 వేల మంది భారతీయులను మోడీ భారతదేశానికి తీసుకువచ్చారన్నారు.
ప్రతి రంగానికి నిధులను మంజూరు చేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి దేశానికి దొరకడం మన అదృష్టంగా భావించాలని అన్నారు.. ఈ విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

