Nizamsagar canal | వర్ని, అక్టోబర్ 4 : వర్ని మండలంలోని జాకోర గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వర్ని పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలియజేశారు. మృతుడికి గడ్డం ఉందని ఒంటిపై ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి ఉన్నట్లు తెలిపారు.
మృతి చెందిన వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా, మృతుడి ఆచూకీకి సంబంధించిన వివరాలు తెలిసినట్లయితే, వెంటనే వర్ని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. గుర్తు తెలిసిన వ్యక్తులు 8712659786 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ఎస్సై తెలిపారు.