ప్రాణదాతలు
కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం..
- నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
- ఒకరి రక్తంతో ముగ్గురికి ప్రాణదానం
- రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది..
కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక్తం ఎక్కించడం. రక్తదానం చేసేవాళ్లు ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో ఇంకొకరి ప్రాణం కాపాడొచ్చు. ఆరోగ్య సమాజం కోసం ఇప్పుడు
రక్తదాతలు అవసరం. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం…
– కామారెడ్డి, జూన్ 13
రోజుకు పది మంది రక్తదానం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేయాలనే ఆలోచనతో వీటీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో 2001 లో వీటీ ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో రోజుకు సుమారు 10మంది వరకు రక్తదానం చేస్తారు. రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా ఉపయోగిస్తారు. ట్రస్టు వ్యవస్థాపకుడు వీటీ రాజ్‌కుమార్ ఇప్పటి వరకు 102సార్లు రక్తదానం చేశారు.
రక్తదాతల సమూహం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రక్తదాతల సమూహాన్ని 2007లో నీల బాలచంద్రం (బాలు) నిర్వహించారు. ఇప్పటి వరకు 10వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సకాలంలో అందజేసి మానత్వాన్ని చాటుతున్నారు. 2016లో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి రెండు వేల నుంచి మూడు వేల మందితో రక్తం అవసరం ఉన్న వారు ఫోన్ చేసినా, వాట్సాప్‌లో మెస్సేజ్ పెట్టినా రక్తదాతల సమూహం నుంచి ఎవరైనా వచ్చి రక్తదానం చేస్తుంటారు. గర్భిణులు, ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడుతున్నారు.
ఇప్పటి వరకు 2306 యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం సేకరించారు. ప్లాస్మా గ్రూప్ నుంచి ఇప్పటి వరకు సుమారు 65మందికి పైగా ప్లాస్మాదానం చేసి ప్రాణాలను కాపాడారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా బాలుకు ఉత్తమ రక్తదాత పురస్కారం అందుకోనున్నారు. ఆపదలో ఉన్న వారు రక్తం కావాలనుకునే వారి కోసం 9492874006 ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసి సకాలంలో స్పందిస్తున్నారు.
102 సార్లు రక్తదానం చేశా..
నేను 1980వ సంవత్సరం నుంచి రక్తదానం చేస్తున్నాను. 2001లో వీటీ ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచితంగా రక్తదానం, ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు 102సార్లు రక్తదానం చేశాను.
– వీటీ రాజ్‌కుమార్, కామారెడ్డి
73సార్లు రక్తదానం చేశా….
ఇప్పటి వరకు 73సార్లు రక్తదానం చేశాను. రక్తదాన సమూహం ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడాం. వాట్సాప్ గ్రూప్ ద్వారా రక్తం అవసమున్న వారికి రక్తదానం చేస్తున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా రక్తదానం గ్రూప్ ద్వారా రక్తాన్ని సేకరించి అందిస్తాం.
– బాలు, కామారెడ్డి
రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు…
రక్తదానం చేయడంతో ప్రాణాలను కాపాడొచ్చు. రక్తదానంతో ఎలాంటి హాని ఉండదు. మనకు కొత్త రక్తం వస్తుంది. సమాజంలో చాలా మంది రక్తం లేక ప్రాణాలను కోల్పోతున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందిస్తున్నాం. ఇప్పటి వరకు 64సార్లు రక్తదానం చేశా.
-డా.వేద ప్రకాశ్, కామారెడ్డి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

