యాప్ ను ఎత్తివేయాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
- రైతాంగంపై సర్కారు నిర్లక్ష్యం.. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
- పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి
- పాలన చేతగాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి
- విలేకరుల సమావేశాల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల, జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్
యాప్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. శనివారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, రైతుల పట్ల రేవంత్‌రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఖలీల్‌వాడి, జూన్ 20: ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.తెలంగాణ సిద్ధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, వ్యవసాయ రంగా న్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. రైతు అభివృద్ధే.. రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో అనేక వినూత్న పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.
రైతును రాజుగా భావించి రైతు సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10వేల చొప్పు న సాయం అందించారని తెలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందించడంతో రైతులు ఎలాం టి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితులు కల్పించారని వివరించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. రైతుబంధు పథకంతో సుమారు రూ.77 వేల కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేశారని, రైతులకు రూ.27 వేల కోట్లకు పైగా రుణ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు.
యాప్‌లో పేరు తో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బిగాల మండిపడ్డారు. వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బా ధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఆ బాధ్యతను విస్మరించి యాప్‌లు, ఆన్లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
రైతాంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లేదని, అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తుచేశారు.రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

