Bahrain | బహ్రెయిన్‌లో విషాదం నెలకొంది. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో నీటిలో మునిగి తెలంగాణ వాసి ప్రాణాలు కోల్పోయారు.
మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్‌గా గుర్తించారు. అతను బహ్రెయిన్‌లోని ఏఎంసీ సంస్థలో ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్‌గా 2019 నవంబర్ 26వ తేదీ నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా సముద్ర తీరానికి వెళ్లిన అతను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న బ్రహెయిన్ కోస్ట్‌గార్డు బృందాలు ఘటనాస్థలికి చేరుకు సహాయక చర్యలు చేపట్టాయి. కానీ లాభం లేకుండాపోయింది.
తోట శ్రీనివాస్ మృతిపై ఏంఎసీ సంస్థ యాజమాన్యం సంతాపం ప్రకటించింది. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.