పలు గ్రామాల్లో ఏకగ్రీవం?
స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకున్నారు.
- సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు
నిజాంసాగర్/కోటగిరి/లింగంపేట/ధర్పల్లి, నవంబర్ 29: స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకున్నారు. అందుకనుగుణంగా ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన ముగిసిన అనంతరం ఏకగ్రీవ ఎన్నికపై అధికార ప్రకటన వెలువడనున్నది.
రెండోసారి ఎన్నికలు లేని తెల్గాపూర్..
మహ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామ పంచాయతీ కార్యవర్గాన్ని స్థానికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం సమావేశమైన గ్రామస్తులు సర్పంచ్‌గా వెల్లుట్ల మేఘన, ఉప సర్పంచ్‌గా వెల్లట్లు సాయిలును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానించారు. అలాగే, ఐదు వార్డు స్థానాలను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. తెల్గపూర్ గ్రామం గతంలో సింగీతం జీపీలో అమ్లెట్ గ్రామం. కేసీఆర్ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చిన సమయంలోనే తెల్గాపూర్ గ్రామాన్ని పంచాయతీగా మార్చారు. గత ఎన్నికల్లో కూడా గ్రామస్తులంతా కలిసి సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కోటగిరి మండలంలో..
కోటగిరి మండలంలోని రాంపూర్, అడ్కాస్పల్లి సర్పంచ్ స్థానాలకు ఒక్కటే నామినేషన్ దాఖలైంది. రాంపూర్ సర్పంచ్‌గా ఎస్టీ మహిళ రిజర్వ్డ్ కావడంతో అదే జీపీ పరిధిలోని రాంపూర్ తండాకు చెందిన విస్లావత్ షామ్కిబాయి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, అడ్కాస్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా రెడ్డి రామకృష్ణ ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆ ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని గ్రామస్తులు చెబుతున్నారు.
మెంగారం జీపీలో కూడా..
లింగంపేట మండలం మెంగారం జీపీ పాలకవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్‌గా కొమ్ముల మౌనిక, ఉపసర్పంచ్‌గా కళాలి బాలాగౌడ్, వార్డు సభ్యులుగా చౌల సుజాత, వడ్ల ప్రసాద్, దాసరి గంగామణి, మార్గం శ్రీనివాస్, నీరడి ప్రవీణ్, కోరంపల్లి భీమేశ్గౌడ్, కుమ్మరి మమతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
మావందికలాన్లోనూ..
బోధన్, నవంబర్ 29: మండలంలోని మావందికలాన్ సర్పంచ్‌తో పాటు 8 వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామస్తుల సమష్టి నిర్ణయం మేరకు.. సర్పంచ్ స్థానానికి శకుంతల ఒక్కరే నామినేషన్ వేశారు. అలాగే, 8 వార్డులకు సైతం ఒక్కొక్కరే దరఖాస్తులు సమర్పించారు. దీంతో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
నామినేషన్లకు ముందే..
రెండోవిడుత స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే ధర్పల్లి మండలంలోని నడిమి తండా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని స్థానికులు తీర్మానించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, శనివారం నడిమి తండా పరిధిలోని నడిమితండా, కార్నల్ తండా, లక్ష్మీ చెరువు తండా, బీరప్ప తండా సహా ఐదు తండాలకు సంబంధించిన వారు సమావేశమయ్యా రు. సర్పంచ్‌గా దారావత్ ఖేలును, ఉపసర్పంచ్‌గా బానావత్ సతీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకున్నారు. ఇందుకోసం వేలం నిర్వహించినట్లు తెలిసింది. అలాగే, మండలంలోని మద్దుల్తండా సర్పంచ్‌గా మెగావత్ అరుణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిసింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

