పతంగుల పండుగ..
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగటి పూటే తారలు దిగివచ్చినట్లుగా.. నింగికి నిచ్చెన వేసినట్టుగా .. ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది కూడా అందమైన పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగటి పూటే తారలు దిగివచ్చినట్లుగా.. నింగికి నిచ్చెన వేసినట్టుగా .. ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది కూడా అందమైన పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మార్కెట్లో విభిన్న రకాల పతంగులు దర్శనమిస్తున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవడంతో పతంగులు ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పండుగ ముందు పతంగుల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి.
ఆకట్టుకుంటున్న పతంగులు
మార్కెట్లో పతంగులు, చెరకలు, దారాలు, మాంజాలు విక్రయిస్తున్నారు. గాలి పటం సైజు నాణ్యతను బట్టి రెండు రూపాయల నుంచి రూ. 150 వరకు (ప్లాస్టిక్) కాగితంతో చేసినవి అందుబాటులో ఉన్నాయి. రెండు కాగితాలతో చేసినవి సైజును బట్టి రూ. 5 నుంచి 40 వరకు విక్రయిస్తున్నారు.మాంజాలలో పాండే, పెన్సిల్ కట్, కించ్కట్ వివిధ ధరల్లో లభ్యమవుతున్నారు. యువత వీటిని కొనడానికి
ఇష్టపడుతున్నారు.
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
- చిన్నారులు, యువత పతంగులను ఎగురవేసే సమయాల్లో పలు జాగ్రత్తలను పాటిస్తే పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు.
- మైదాన ప్రాంతాల్లో మాత్రమే పతంగులను ఎగురవేయాలి.
- విద్యుత్‌వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉండే చోట పతంగులను ఎగురవేసే సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
- పెద్దపెద్ద భవనాలు, కొండ ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయకపోవడమే శ్రేయస్కరం.
- అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజాను ఉపయోగించి పతంగులను ఎగురవేయరాదు.
- పతంగులు ఎగురవేసేటప్పుడు చిన్నారులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

