అంబరమంటినఆర్టీసీ సంబురాలు
ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్నంటా యి. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4803 మంది కార్మికులకు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
- ప్రభుత్వంలో రోడ్డు రవాణా సంస్థ విలీనం
- ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులు
- ఉమ్మడి జిల్లాలో 4803 మందికి ప్రయోజనం
- ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం
ఖలీల్‌వాడి, సెప్టంబర్ 15 : ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్నంటా యి. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4803 మంది కార్మికులకు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. కేసీఆర్ సర్కారు నిర్ణయంపై కార్మికుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు సంబురాల్లో మునిగిపోయారు. వేలాది మంది కార్మికుల కుటుంబాల్లో ఆనందం నింపిన కేసీఆర్‌కు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్లకు అతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కుదేలైన ఆర్టీసీ తీవ్రమైన నష్టాలను మూటగట్టుకున్నది ఒకానొక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆర్టీసీకి కొండంత అండగా నిలిచారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎనలేని కృషి చేశారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ కార్గో వంటి సేవలను తీసుకు వచ్చారు.
సీఎం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం
ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ రీజియన్ పరిగణిస్తున్నారు. ఇందులో మొత్తం 5 డిపోలున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోల ద్వారా నిత్యం వందలాది బస్సులు తిరుగుతున్నాయి. తక్కువ ఛార్జీల్లోనే సుదూర ప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణికులను చేరవేస్తూ కీలక భూమికను ఆర్టీసీ పోషిస్తున్నది. నిజామాబాద్ రీజియన్‌లో 1200 బస్సులుండగా 4803 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. అత్యధికంగా నిజామాబాద్ 1,2 డిపోల్లో 650 బస్సులుండగా 2800 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాన్సువాడలో 106 బస్సులుండగా 490 మంది, కామారెడ్డిలో 140 బస్సులు ఉండగా 603 మంది, ఆర్మూర్‌లో 88 బస్సులు ఉండగా 460 మంది బోధన్‌లో 114 బస్సులుండగా 450 మంది సిబ్బంది ప్రజారవాణాలో పాలుపంచుకుంటున్నారు.
బాజిరెడ్డి కాలుపెట్టిన వేళా విశేషం
ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకోవడంతో అంతటా ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఆది నుంచి అండగా నిలిచారు. పని భారాన్ని తగ్గిస్తూనే జీతాలను గతం కన్నా మెరుగ్గా పెంచి అమలు చేశారు. కార్మికుల ఏండ్ల కలను సాకారం చేసి ఉద్యోగ భద్రతను కల్పించడంతో సీఎం తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ కీలకమైన సమయంలో జిల్లాకు చెందిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్‌గా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో వినూత్నమైన నిర్ణయా లు అమలవుతున్నాయి.
ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు
ఆర్టీసీని విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రజారవాణా మరింత పటిష్టం చేయాలి. సీఎం కేసీఆర్ తీసుకున్న విలీన నిర్ణయం సాహసోపేతమైనది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కేవలం కేసీఆర్‌కే సాధ్యం. వేలాది మంది కుటుంబాల్లో ఆనందం నింపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఈ కీలక ఘట్టంలో నేను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

