చిహ్నాల తొలగింపు ప్రజల్ని అవమానించడమే..
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
- మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల
కంఠేశ్వర్, జూన్ 3: ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండా, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు రాజకీయంపై ఉన్న ప్రేమ.. పాలన మీద లేదని అన్నారు. పాలనపై ప్రేమ ఉంటే రైతుల గురించి ఆలోచించేవాడని, ఇప్పటి వరకు రైతుబంధు, భరోసా ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నదని అన్నారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, ఎనగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

