Banswada | బాన్సువాడ, ఆగస్టు 6 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త, ప్రాపెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ మక్బూల్, పేరోజు, ఖలీల్, మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్, మోచి గణేష్, అక్బర్, గండ్ల కృష్ణ, ఇసాక్, శివసురి, నాయిని మొగులయ్య,ఖాదర్, గంగారం,కాసుల బాబు, చాకలి రాము తదితరులు పాల్గొన్నారు.