Baby girl sale | వినాయక్ నగర్, జులై12 : ఆడ పుట్టడంతో ఆమెను పోషించడం బరువుగా భావించిన తల్లిదండ్రులు ఎలాగైనా భారం తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో నవ మాసాలు మోసి తన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇతరులకు విక్రయించడం బిడ్డలు లేని తల్లిదండ్రులకు ఆవేదన కలిగించింది.
తమకు పుట్టిన పసిబిడ్డను మధ్యవర్తుల సాయంతో మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారికి గ్రహించిన ఘటన చైల్డ్ వెల్ఫేర్ అధికారిని ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావు లకు అప్పటికే నలుగురు ఆడబిడ్డలు ఉన్నారు.
జూన్ 30న ఐదో సంతానంలో సైతం ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఆడబిడ్డలను పోషించడం తమకు భారమవుతుందని ఆ తల్లిదండ్రులు అదే ప్రాంతానికి చెందిన ఉమారాణి అనే మహిళ తమకు పరిచయస్తులు అయిన నాగమణి అనే మహిళతో కలిసి మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన వ్యక్తి కి వారి ఐదో సంతానమైన పసిబిడ్డను ఈనెల 6న రూ.2 లక్షల కు విక్రయించారు.
పసిపాపను విక్రయించిన విషయం తెలియడంతో సీడీపీవో సౌందర్య శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా ఎస్హెచ్వో రఘుపతి వెల్లడించారు.