యువత ఉద్యోగాలపై దృష్టిపెట్టాలి
యువత తమ బంగారు భవిష్యత్తు కోసం ముందుగా ఉద్యోగాలపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దనగరాలకు సమానంగా స్థానికులకు అవకాశాలు కల్పించేదుకే ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. నిజామాబాద్ నగరంలో త్వరలో ప్రారంభించనున్న ఐటీహబ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్‌మేళాకు కవిత ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
- స్థానికులకు అవకాశాలు కల్పించేందుకే ఐటీ హబ్ ఏర్పాటు
- స్కిల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- రెండో దశ ఐటీ హబ్‌ను కూడా అభివృద్ధి చేస్తాం
- జాబ్‌మేళాలో ఎమ్మెల్సీ కవిత
ఖలీల్‌వాడి, జూలై 21 : యువత తమ బంగారు భవిష్యత్తు కోసం ముందుగా ఉద్యోగాలపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దనగరాలకు సమానంగా స్థానికులకు అవకాశాలు కల్పించేదుకే ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. నిజామాబాద్ నగరంలో త్వరలో ప్రారంభించనున్న ఐటీహబ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్‌మేళాకు కవిత ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలు కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమయ్యేవని, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ స్థానికులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడే వివిధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ ప్రతినిధులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలకు కవిత ధన్యవాదాలు తెలిపారు.

రూ.40 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల మేర సిద్ధం చేసిన ఈ ఐటీహబ్ కేవలం ఉద్యోగాల కోసమే కాదని, కొత్త సంస్థలను సొంతంగా ఏర్పాటు చేసి ఉద్యోగాలను సృష్టించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. భవనంలో ఒక్కో చైర్‌కు నెలకు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. యువత తమ స్కిల్స్‌ను చాటేందుకు వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ రాకపోతే నిరుత్సాహపడొద్దన్నారు. 745 సీట్లు ఉన్నాయని, మరోసారి ప్రయత్నించాలని సూచించారు. టాస్క్ ఆధ్వర్యంలో మరో వెయ్యి మందికి ఐటీ, ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఇక ఇందూరు నగరం సాఫ్ట్వేర్ అభివృద్ధికి కేంద్ర బిందువు కానున్నదని అభిప్రాయపడ్డారు. మొదటి దశ ఐటీ హబ్ పూర్తయ్యిందని, రెండో దశ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇండస్ట్రీయల్ పార్క్, ఆటో పార్క్‌ను ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. యువత రాజకీయాల కన్నా ముందు ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

జాబ్ కోసం ఆసక్తిగా వచ్చాను..
స్థానికంగా జాబ్ చేయాలనే ఆసక్తితో ఇక్కడి వచ్చాను. చాలా పెద్ద ఎత్తున జాబ్‌మేళా నిర్వహించారు. ఇదివరకు ఎప్ప డూ ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడం నేను చూడలేదు. ఐటీ హబ్‌లో జాబ్ వస్తే మాత్రం అదృష్టమే.
– నందిని, నిజామాబాద్
ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు..
జాబ్‌మేళా అంటే ఓసారి వెళ్లి.. తిరిగొచ్చేదే అనుకున్నా. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తితో వచ్చారు. చాలా కంపెనీలు ఇంటర్వ్యూలు చేశాయి. ఇబ్బంది కలుగకుండా వేల మందికి భోజనం పెట్టడం అభినందనీయం.
-కీర్తి , నిజామాబాద్
జాతరను తలపించింది..
జాబ్‌మేళాలో ఎటు చూసినా అభ్యర్థులే కనిపించారు. ప్రాంగణంలో కాలు పెట్టడానికి జాగలేదు. జాతరకు వచ్చినట్లుగా తరలివచ్చారు. ఇంత మంది అభ్యర్థులు రావడం నేనైతే ఎప్పుడూ చూడలేదు.
-దయాకర్, కమ్మర్పల్లి
జాబ్ వస్తదనే నమ్మకముంది..
జాబ్‌మేళాపై ప్లాన్ ప్రకారం ప్రచారం చేశారు. నేను ముందుగానే రిజిస్ర్టేషన్ చేయించుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. అయిన సరే జాబ్ వస్తుందనే నమ్మకం ఉంది.
-చరణ్, నిజామాబాద్
రిజిస్ట్రేషన్లు చేయించడం బాగుంది..
చాలా వరకు జాబ్‌మేళాలు గందరగోళంగా మారుతాయి. ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ప్రచారం చేయడంతో సులభం అయ్యింది. అభ్యర్థులకు కూడా ఇబ్బంది కలుగలేదు. వేలసంఖ్యలో హాజరైనప్పటికీ అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
-జగదీశ్, డిచ్పల్లి
అవకాశాలు కల్పించడం అభినందనీయం..
ఉద్యోగాల కోసం పోటీ పెరిగింది. అందుకు తగినట్లు అవకాశాలు కల్పించడం అభినందనీయం. నిజామాబాద్‌లో ఐటీహబ్ నిర్మించడం సంతోషం. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే జాబ్ సాధించి హాయిగా చేసుకోవచ్చు.
-కిరణ్ , నందిపేట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

