పూల సింగిడి
పూల పండుగతో ఆర్మూర్ పరవశించింది. బతుకమ్మ పాటలతో నవనాథపురం మార్మోగింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ సంబురాలకు మహిళలు పోటెత్తారు. మన జీవన విధానాన్ని కండ్లకు కట్టేలా పాటలు పాడుతూ, లయబద్ధంగా పాదాలు కదిపారు. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- ఆర్మూర్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
- హాజరైన ఎమ్మెల్సీ కవిత
పూల పండుగతో ఆర్మూర్ పరవశించింది. బతుకమ్మ పాటలతో నవనాథపురం మార్మోగింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ సంబురాలకు మహిళలు పోటెత్తారు. మన జీవన విధానాన్ని కండ్లకు కట్టేలా పాటలు పాడుతూ, లయబద్ధంగా పాదాలు కదిపారు. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రజిత దంపతులు, మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం నుంచి బతుకమ్మలు పేర్చుతూ, పాటలు పాడుతూ ఉత్సాహం నింపారు. అనంతరం జంబి హనుమాన్ వద్ద వేలాదిగా తరలివచ్చిన సుహాసినులతో కలిసి ఆడిపాడారు.
– నందిపేట్, అక్టోబర్ 19
నందిపేట్, అక్టోబర్ 19: ఆర్మూర్ పట్టణం పూలవనమైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు బతుకమ్మ వేడుకలతో సందడిగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. పట్టణంలోని పలువురి ఇండ్లల్లో బతుకమ్మలను పేర్చారు. అనంతరం గోల్‌బంగ్లా నుంచి ఊరేగింపుగా బయల్దేరారు. పొద్దుపోయాక జంబి హనుమాన్ మందిరం ఆవరణలో రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య వేలాది మంది మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

మహిళలు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పువ్వులను దేవుడిలా పూజించి పండగ చేసుకుంటామన్నారు. బతుకమ్మ పండగకు ఎంతో విశిష్టత ఉందని, ఈ విశిష్టతను పండగ సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు వివరించి పాటలను నేర్పించాలని ఆమె సూచించారు. బతుకమ్మను పండగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవిస్తున్నదని, తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా గుర్తించడం గర్వకారణమన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారన్నారు. బతుకమ్మ పండుగ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్సీ అన్నారు. కార్యక్రమంలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి -రజితారెడ్డి దంపతులు మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

ఒక్కేసి .. పువ్వేసి చందమామ..
జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత గురువారం ఉదయం పెర్కిట్‌లోని గురడిరెడ్డి సంఘంలో ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డి.. స్థానిక మహిళలతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. అలాగే మామిడిపల్లిలోని కౌన్సిలర్ సంగీతా రవిగౌడ్ ఇంట్లో, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతీసింగ్ ఇంట్లో బతుకమ్మలను పేర్చారు. అనంతరం ఆర్యవైశ్య సంఘంలో మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ నివాసంలో బతుకమ్మను స్థానిక మహిళలతో కలిసి పేర్చారు. ఎమ్మెల్సీ కవితకు స్థానిక మహిళలు సంప్రదాయం ఉట్టిపడేలా మంగళహారతులు, బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. ర్యాలీగా వారి ఇండ్లకు చేరుకొని కన్నుల పండవగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. స్థానిక మహిళలతో బతుకమ్మ ఆడిపాడి స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారు.

Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

