ప్రజలకు అండగా నిలవాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు మంత్రి వేముల ఆదేశాలు

నిజామాబాద్ : భారీ వర్ష సూచన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు తమతమ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పటికీ విరామ సమయంలో సోమవారం ఉభయ జిల్లాల్లో వర్ష పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఫోన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్‌తో మాట్లాడారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస చర్యలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా భారీ వర్ష సూచనపై హెచ్చరికలు జారీ చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పలు మార్లు భారీ వానలు కురిసినప్పటికీ జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎటువంటి ప్రమాదాలకు వెలుగు చూడలేదని చెప్పారు. అదే స్ఫూర్తితో పని చేసి తుఫాన్ గండం నుంచి బయట పడేలా పని చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, రోడ్డు – భవనాలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపాలిటీ, వ్యవసాయ, ఎలక్ట్రిసిటీతో పాటుగా ఇతర శాఖల అధికారులు మరింత ప్రమత్తంగా ఉండాలని మంత్రి వెల్లడించారు.
అదేవిధంగా ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ఆది, సోమవారాల్లో కురిసిన వానలతో గోదావరిలోకి ప్రవాహం పెరిగే ఆస్కారం ఉందని మంత్రి తెలిపారు. గోదావరి ప్రవాహానికి తగ్గట్లుగా ఎస్సారెస్పీ అధికారులు చర్యలు తీసుకుంటారని దిగువ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూడాలని చెప్పారు. ఎస్సారెస్పీ పరివాహక ప్రాంత ప్రజలను, నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండవల్సిందిగా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

