ఆర్మూర్, నవంబర్ 8: ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్‌రెడ్డి.. మూడోసారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి కేటీఆర్ ఆర్మూర్‌కు చేరుకొని ఆలూర్ బైపాస్ రోడ్డులో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా సుమారు 50వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.