Medical Shops | కోటగిరిలో మెడికల్ షాపుల బంద్ విజయవంతం
ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజయవంతమైందని కోటగిరి, పోతంగల్ మండలాల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి సీతాలే విజయ్ అన్నారు.
Medical Shops | కోటగిరి, మే 20 : ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజయవంతమైందని కోటగిరి, పోతంగల్ మండలాల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి సీతాలే విజయ్ అన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మెడికల్ షాపులు బంద్ పాటిస్తూ కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు చేయడం అధికంగా డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా నాసిరకమైన మందులు మార్కెట్లో చలామణి అవుతున్నాయని, దీని ద్వారా చిన్న మెడికల్ షాపుల పై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ పాటిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 817 జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పల సాయిలు, నాగభూషణం గౌడ్, కప్ప సాయిలు, సాయగౌడ్. మాశెట్టి విఠల్ , నరేందర్ గోపాల్, శ్రీకాంత్ లింగరాం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

