Kamareddy | 29న నిర్వహించే దీక్ష దివస్‌ను విజయవంతం చేయాలి.. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్
ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Kamareddy | కామారెడ్డి : ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష దీక్ష ఫలితంగానే రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఆమరణ నిరాహార దీక్షకు కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. కావున ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా దీక్ష దివస్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఉద్యమ సమయంలో 35 పార్టీల మద్దతు కూడబెట్టి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అందుకే తెలంగాణ జాతిపితగా కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆరు గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఈ వర్షాకాలం పంటలను రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రేవంత్ రెడ్డి దళారుల పాలు చేశాడని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కాసర్ల స్వామి, కో ఆప్షన్ నెంబర్ కుంభాల రవి యాదవ్, బలవంతరావు, కృష్ణాజి రావు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అటవీ నిబంధనలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : సీఈఓ నాగలక్ష్మి
Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
Vaibhav Sooryavanshi | పిజ్జాకు దూరం.. రోజుకు 600 బంతుల ప్రాక్టీస్.. వైభవ్ సూర్యవంశీ ట్రైనింగ్, న్యూట్రిషన్ సీక్రెట్స్ తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

