Bodhan | దీక్ష దివస్‌ను విజయవంతం చేయాలి.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో భాగంగా నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ నిర్వహించిన దీక్ష సందర్భంగా నిర్వహించే దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమెర్ వెల్లడించారు.
Bodhan | బోధన్ : తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో భాగంగా నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ నిర్వహించిన దీక్ష సందర్భంగా నిర్వహించే దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమెర్ వెల్లడించారు. బోధన్ పట్టణంలోని ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నిర్వహించిన ఉద్యమంలో వివిధ రకాలుగా పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని ఆయన కోరారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ స్ఫూర్తితో, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమాల్లో బోధన్ ప్రాంతంలో ప్రజలు, ఉద్యోగులు, నాయకులు, కవులు, రచయితలు, ఉద్యమకారులు పలు రకాలుగా పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
29 న నిర్వహిస్తున్న కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలంగాణ వాదులు తరలిరావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో బోధన్ ప్రాంతం స్మశానంగా మారిందని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమెర్ విమర్శించారు. బోధన్ నియోజకవర్గ ప్రజలు చేసిన చిన్న పొరపాటు కారణంగా విజయం సాధించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం శోచనీయమన్నారు. ఆయన స్థానికంగా ఉండకపోవడంతో పాటు ఆయనకు పీఏ కూడా ఎవరు విధులు నిర్వహిస్తున్నారనేది ప్రజలకు తెలియదని, ఆయన కింద పనిచేసే నాయకులే ఏజెంట్లుగా మారి విధులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఊహించని విధంగా అందించిన సంక్షేమ పథకాలు కొనసాగించడంలో కూడా కాంగ్రెస్ తీవ్ర ఇబ్బంది పడుతుందని ఆరోపించారు.
నిజాంసాగర్ లో నీరున్న రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించకపోవడం శోచనీయం అన్నారు. రైతులు నానా కష్టాలు పడి పండించిన వరి పంటను కూడా కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం, పిఏ లేకపోవడంతో సామాన్యులు తమరి ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశం లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గిర్దావర్ గంగా రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, మండలాల అధ్యక్షులు సంజీవ్ కుమార్, దేరేడి శ్రీ రాం, భూమ్ రెడ్డి, నర్సింగ్ రావు, కౌన్సిలర్లు ముషీర్ బాబా, గుమ్ముల అశోక్ రెడ్డి, ముబీన్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

