జక్రాన్‌పల్లి, మే 11: జిల్లాలో వీడీసీలు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, బాధితులకు అండగా ఉంటూ న్యాయ పోటారం చేస్తున్నట్లు ఇండియన్ లీగల్ ప్రొఫెసనల్స్ అసోసియేషన్(ఐఎల్పీఏ) బృందం సభ్యులు పొన్నం దేవరాజ్‌గౌడ్, శాంసన్, వీఎం కృష్ణారెడ్డి, నరేందర్, అనంత ఆంజనేయులుగౌడ్, రాజారాం, సుమలత, సురేశ్, వెంకటేశ్ ప్రసాద్ అన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంతోపాటు ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామాల్లో వీడీసీల దౌర్జన్యాలపై నిజ నిర్ధారణ చేసినట్లు తెలిపారు.
జక్రాన్‌పల్లిలో భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీధర్, బీఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్, రక్షక్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ సమావేశంలో పాల్గొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడీసీలకు వ్యతిరేకంగా, బాధితులకు అండగా నిలుస్తామని ఐఎల్పీఏ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ పొన్నం దేవరాజ్‌గౌడ్ అన్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వీడీసీలపై కోర్టుల్లో కేసులు దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
చాకలి, ఎస్సీ కులస్తులు వీడీసీల దౌర్జన్యాలను కమిటీకి వివరించారు. వీడీసీ నుంచి ఏడాది నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. ఆరు నెలల క్రితం నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్‌ను కూల్చివేశారని తెలిపారు. రూ.10 లక్షల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేశారని, పదేండ్ల నుంచి దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేయనివ్వడం లేదని, కూలీ పనికి పిలవడం లేదని, శుభ, అశుభ కార్యాలకు హాజరు కాకుండా గ్రామ బహిష్కరణ చేశారని వాపోయారు.
న్యాయవాది జగడం రాజశేఖర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గూపన్పల్లి శంకర్, జగడం సురేశ్, నడ్కుడ శ్యామల, నడ్కుడ పద్మ, జగడం లక్ష్మి, దుబ్బాక చిన్నుబాయి, జగడం మోహన్, భూషణ్, శ్రావణ్‌కుమార్, అర్జున్, సదాశివుడు, వెంకటేశ్, తిరుమలేశ్, నవీన్, భాస్కర్, పవన్, తరుణ్, అబ్బన్న, స్రవంతి, లింగం పాల్గొన్నారు.