జిల్లా ప్రభుత్వ దవాఖానలో మోకాలిచిప్పల మార్పిడి
- శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు
- హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే..
- పేదలకు తగ్గనున్న ఆర్థిక
- ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన వైద్యాధికారులు
- త్వరలో సందర్శించనున్న ప్రత్యేక బృందం
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 1: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన పేదలకు వరంగా మారింది. ప్రతిరోజూ వెయ్యి నుంచి 15 వందల మందికి ఓపీ సేవలందిస్తున్నారు. ఇప్పటికే వివిధ వ్యాధులకు చికిత్స అందిస్తుండగా, దవాఖానలో త్వరలో మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్సలు చేయనున్నారు. పేదలపై ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్ర భుత్వ దవాఖానల్లో ఆర్థోపెడిక్ సేవలపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులను ఆదేశించారు. దీంతో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు అందజేశారు.
అత్యాధునిక పరికరాలతో వైద్యసేవలు
జిల్లా ప్రభుత్వ దవాఖానలో కిడ్నీ రోగులకు అత్యాధునిక పరికరాలతో డయాలసిస్ చేస్తున్నారు. క్యాన్సర్ తదితర వాధ్యులకు సంబంధించి ఆపరేషన్లు చేసి వైద్యులు శభాష్ అనిపించుకున్నారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. దవాఖానలో వసతులపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టిసారించడంతో అత్యాధునిక పరికరాలు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృం దం రానున్నది. దవాఖానను సందర్శించి ఆపరేషన్ థియేటర్లను పరిశీలించనున్నది. ఆధునాతన పరికరాలను తీసుకువచ్చేందుకు అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. మోకాలి చిప్ప ఆపరేషన్ కార్పొరేట్ దవాఖానల్లో రూ. మూడు నుంచి ఐదు లక్షలు కాగా, ప్రభుత్వ దవాఖానలో పూర్తిగా ఉచితంగా చేయనున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో మోకాలి చిప్ప మార్పిడి చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుండడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే మోకాలి చిప్పల మార్పిడి విభాగం ఏర్పాటు
మోకాలి చిప్ప మార్పిడి విభాగం ఏర్పాటు కోసం అవసరమైన పరికరాలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం. అత్యాధునిక పరికరాలు తీసుకురానున్నాం. ఆపరేషన్‌కు సంబంధించి మిషన్లు, థియేటర్ డిజైన్ కోసం ప్రత్యేక బృందం త్వరలో రానున్నది. సాధ్యమైనంత త్వరగా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.
-ప్రతిమారాజ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

