ఆటోను ఢీకొట్టిన లారీ : ఇద్దరు మహిళలు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
ఆటోను ఢీకొట్టిన లారీ | కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి వద్ద ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. గాయపడిన వారిని తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా నిజామాబాద్లో బంధువు అంత్యక్రియలకు హాజరై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

