మూడో రోజు ఏడు నామినేషన్లు
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మూడోరోజైన శనివారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
- ఇప్పటి వరకు 16 నామినేషన్లు దాఖలు
కంఠేశ్వర్, ఏప్రిల్ 20: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మూడోరోజైన శనివారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన రాగి అనిల్, భుక్యానందు, దేవతి శ్రీనివాస్ శనివారం రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.స్వతంత్ర అభ్యర్థులుగా ఆరె రాజేందర్, గంట చరితారావు, సయ్యద్ అస్గర్, మిర్యాల్కర్ జయప్రకాశ్ నామినేషన్లు వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 16 నామినేషన్లు వచినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
నామినేషన్ వేసిన గాలి అనిల్‌కుమార్
జహీరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ శనివారం నామినేషన్ వేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, సంగారెడ్డి జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

