జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్, బోధన్ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ జెండాను ఆవిష్కరించారు.