రాజకీయాలకు అతీతంగా హరితహారం
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో పదేండ్లలో తొమ్మిది శాతం పచ్చదనాన్ని పెంచుకోగలిగామని ఎమ్మెల్యే వేముల అన్నారు.
మోర్తాడ్, జూలై 15: రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో పదేండ్లలో తొమ్మిది శాతం పచ్చదనాన్ని పెంచుకోగలిగామని ఎమ్మెల్యే వేముల అన్నారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామశివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి వ్యక్తి కనీసం మూడు మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. చెట్లు నరికే వారి విషయంలో అటవీశాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో భవానీశంకర్, ఎఫ్ఆర్వో రవీందర్, బీఆర్ఎస్ మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల అధ్యక్షులు ఏలియా, రేగుంట దేవేందర్, జడ్పీటీసీ బద్దంరవి, పర్స దేవన్న, ముత్యాల లక్ష్మణ్, రమేశ్, పాపాయిపవన్,సత్యనారాయణ గ్రామపెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

