ముగిసిన తొలి విడుదల నామినేషన్ల పరిశీలన
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలనను ఆదివారం ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు అధికారులు చేపట్టారు.
- రోజంతా కొనసాగిన ప్రక్రియ
- పలు కేంద్రాల్లో పొద్దుపోయేంత వరకూ స్క్రూటినీ
బోధన్, నవంబర్ 30: తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలనను ఆదివారం ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు అధికారులు చేపట్టారు. కొన్ని కేంద్రాల్లో నామినేషన్ల స్క్రూటినీ రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగడం గమనార్హం. నామినేషన్ల దాఖలులో మొదటి రెండు రోజులు మందకోడిగా నామినేషన్లు దాఖలు కాగా.. చివరి రోజు శనివారం పుంజుకున్నాయి. దీంతో ఆదివారం నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినీలో విపరీతమైన ఆలస్యం చోటుచేసుకున్నది. బోధన్ డివిజన్లోని సర్పంచ్ స్థానాలకు చివరి రోజు 863 నామినేషన్లు వచ్చాయి. దీంతో మూడు రోజుపాటు దాఖలయిన నామినేషన్లు 1,167 అయ్యాయి.
ఇదే విధంగా చివరి రోజున వార్డు స్థానాల కోసం 3,151 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 3,533కు పెరిగింది. మూడు రోజులపాటు దాఖలైన నామినేషన్లలో ఎన్నికల నిబంధనల మేరకు సక్రమంగా లేని నామినేషన్లను ఆయా గ్రామ పంచాయతీ క్లస్టర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తోసిపుచ్చారు. అనంతరం చెల్లుబాటైన నామినేషన్ల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కాగా, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల అర్హతల ఫిర్యాదులకు సంబంధించిన అప్పీళ్లకు సోమవారం అవకాశం కల్పించనున్నారు. సోమవారం వచ్చిన అప్పీళ్లను ఆ మర్నాడు పరిశీలిస్తారు. అనంతరం పోటీలో ఉన్న అర్హులైన అభ్యర్థుల జాబితాను ఈనెల 3న సాయంత్రం ప్రకటిస్తారు. వారికి గుర్తులను కూడా కేటాయిస్తారు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

