పైసా పెట్టు.. ఆర్డర్ పట్టు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవుతున్నాయి.
- బదిలీల్లో చేతివాటం!
- విలవిల్లాడుతున్న ప్రభుత్వ టీచర్లు
- రిలీవింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు లంచం
- పలువురు ఎంఈవోలపై ఫిర్యాదులు
- బహిరంగంగానే వసూళ్లు చేస్తున్న వైనం
- కామారెడ్డి జిల్లాలో చేష్టాలుడిగిన యంత్రాంగం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవుతున్నాయి. బదిలీల్లో భాగంగా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లాలంటే పైసలు ఇవ్వనిదే ఆర్డర్ కాపీలు చేతికి రావడం లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని మండలాల్లో బదిలీ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మండల విద్యాశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందులో ఆది నుంచి కళంకితులుగా ముద్రపడిన ఎంఈవోల తీరు తీవ్ర దుమారం రేపుతున్నది. రిలీవింగ్ ఆర్డర్ జారీ చేసేందుకు బహిరంగంగానే పెద్ద ఎత్తున డబ్బులు అడుగుతుండడం విద్యాశాఖలో చర్చనీయాంశం అవుతున్నది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రభుత్వ టీచర్లు వీరి ఆగడాలకు విలవిల్లాడుతున్నారు. తాము సభ్యత్వం తీసుకున్న యూనియన్ నాయకులకు తమ బాధలను చెప్పుకుంటే సర్వసాధారణం అంటూ కొట్టి పారేస్తుండడం విస్తు గొల్పుతున్నది. ఎంఈవోల ఆగడాలకు కళ్లెం వేయాల్సి ఉండగా యూనియన్ లీడర్లు కూడా పట్టనట్లు ఉండడంపై టీచర్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
-నిజామాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇదేం బేరం..
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో టీచర్ల బదిలీల్లో బేరసారాలు భారీగా జరుగుతున్నాయి. ఏండ్లుగా ఒకేచోట పని చేస్తున్న చాలా మంది ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బదిలీ జరిగిన చోటికి ఆనందంగా వెళ్తున్నారు. తాము అనుకున్న చోటికి బదిలీ అవుతున్న ఆనందం వారిలో కొంతసేపటికే ఆవిరి అవుతున్నది. మండల స్థాయిలో విద్యాశాఖాధికారులు డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తుండడంతో ఈ దుస్థితి ఏర్పడింది. రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఎంఈవోలు సతాయిస్తుం డడంతో చేసేది లేక నగదును ముట్టజెప్పుకుంటున్నారు. ఇక హెడ్మాస్టర్ స్థాయిలో బదిలీలు జరిగితే రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూళ్ల పర్వం యథేచ్ఛగా జరుగుతున్నది. స్కూల్ నిర్వహణకు ప్రభుత్వం మంజూ రు చేసే డబ్బులను ఇవ్వాలంటూ ఎంఈవోలే స్వయంగా ఉచిత సలహాలు చెబుతుండడంతో చేసేది లేక ఇచ్చేస్తున్నారు. డబ్బుల్లేవు అని సమాధానం చెబితే రిలీవింగ్ ఆర్డర్ జారీలో జాప్యం చేయడంతోపాటు సదరు టీచర్లకు సంబంధించిన ఫోన్లను ఎత్తకపోవడం, సమాధానం ఇవ్వకుండా సతాయించడం జరుగుతుందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సదరు కళంకిత ఎంఈవోల తీరుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చేతులెత్తేసిన లీడర్లు..
విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి కంపు అధికార పార్టీకి తలవంపుగా మారుతున్నది. ఈ పరిస్థితిపై పలువురు టీచర్లు తమ గోడును అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో చెప్పుకున్నారు. ఇలాంటి బేరాలు సరికాదని, సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సందేశాలు పంపించారు. కానీ అవినీతి దందా ఆగకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పలువురు టీచర్లు మరో అడుగు ముందుకేసి యూనియన్ నేతలకు ఫోన్లు చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న తంతుపై వివరంగా వివరాలను చెప్పారు. కానీ వారు కూడా చేతులెత్తేయడంతో టీచర్లు బాధితులుగానే మారిపోవాల్సి వస్తున్నది. యూనియన్ నేతలను ఆశ్రయించిన టీచర్ల వివరాలు లీకవ్వడంతో వారిని కక్ష కట్టి మరీ ఎంఈవో వేధిస్తుండడం విచిత్రంగా మారింది. దొందు దొందే అన్నట్లుగా కళంకిత ఎంఈవోకు పలువురు ఉపాధ్యాయ నాయకులు అండగా నిలువడం చర్చనీయాంశం అవుతున్నది. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఈ వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయని సమాచారం. ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్న ఓ అధికారి బహిరంగంగానే ఈ తంతుకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తున్నది. సదరు అధికారి తీరును చూసి మిగిలిన మండలాల్లోని ఎంఈవోలు కూడా వసూళ్లకు తెగబడుతున్నట్లుగా సమాచారం. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తున్నది. కానీ డీఈవో స్థాయిలోనూ నిర్లక్ష్యమే సమాధానం రావడంతో దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తున్నది. ఈ విషయంపై కామారెడ్డి డీఈవో రాజును వివరణ కోసం నమస్తే తెలంగాణ సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

