కేసీఆర్ చేసిన మేలు మర్చిపోను..
పార్టీ మారినప్పటికీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన మేలును తాను మరిచిపోనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గుర్తుచేశారు.
- మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ/కోటగిరి, జూలై 26: పార్టీ మారినప్పటికీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన మేలును తాను మరిచిపోనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ సహకారం తో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లను మంజూరు చేయించానన్నా రు. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ మారాల్సి వచ్చిందన్న ఆయన.. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన కేసీఆర్‌కు, నిధు లు తెచ్చుకున్న తనకు పార్టీ మారినందున బాధ ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజుతో కలిసి శుక్రవారం బాన్సువాడ, కోటగిరి మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పోచారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. కేసీఆర్ హయాంలో నియోజకవర్గంలో రూ.550 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులకు రూ.150 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.150 కోట్లతోపాటు రూ.160 కోట్లతో చందూర్ లిఫ్ట్, రూ.200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు చేపట్టామన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి రిటైర్ అవ్వాలనే ఆలోచనతోనే పార్టీ మారినట్లు చెప్పారు. నియోజకవర్గ నిధుల కోసమే చేరుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పానన్నారు.
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిలో పోచారం శీనన్నది పెద్దన్న పాత్ర అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసమే కాంగ్రెస్‌లో చేరారని, కష్టకాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఒప్పించి పాత డబుల్ బెడ్ రూం ఇండ్ల బిల్లులను తెచ్చి పేదలకు అందిస్తున్నారన్నారు. పోచారం సురేందర్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసై టీ అధ్యక్షుడు వై.కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజా స్, గోపాల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నార్ల సురేశ్ గుప్తా, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, మాజీ ఎంపీపీ శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

