వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి బాన్సువాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- కాంగ్రెస్ అబద్ధాల కోరు..బీజేపీ ఢోకాబాజీ పార్టీ
- బీజేపీకి 200సీట్లు దాటవు..
- మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి
బాన్సువాడ, మే 11: దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి బాన్సువాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఆయా రాష్ర్టాల ప్రాంతీయ పార్టీలు ఏకమై సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలుకుతాయని, బీజేపీకి 200 సీట్లు కూడా దాటవని చెప్పారు. బీజేపీ పేద ప్రజలకు చేసిందేమీ లేదని, అదానీ, అంబానీలకు రూ.15లక్షల కోట్లను మాఫీ చేసిందని అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ఉసిగొల్పుతూ, యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు.
బీజేపీకి ఒక ఆయోధ్య రామమందిరం తప్ప, ఎజెండా లేదన్నారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలుండి రాష్ర్టానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రం నుంచి పన్ను రూపేనా కేంద్రానికి రూ. 3లక్షల కోట్లు చెల్లిస్తే, రాష్ర్టానికి ఇచ్చింది రూ.లక్షా60 కోట్లు మాత్రమే అని తెలిపారు. మోదీ సబ్ కా వినాష్ చేస్తున్నారని సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ఉమాభారతి అన్నారని, దాన్ని బట్టి చూస్తే బీజేపీ రోజు రోజుకూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నదని చెప్పారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని తిరుగరాస్తామని చెప్పడం ఎంత వరకు సబబు అని, రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను అవమానపర్చడమే అని, పేద ప్రజల హక్కు రాజ్యంగమని వివరించారు.
కాంగ్రెస్ అబద్ధాల పార్టీ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని, ఐదు నెలలోనే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అని ప్రజలు గ్రహించారని పోచారం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 నుంచి 12 స్థానాల్లో గెలువబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని చెప్పారు. 13న నిర్వహించే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 50 వేల మెజార్టీ వస్తుందని, ఎంపీ స్థానాన్ని లక్షా50 వేల మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పారు.
ముస్లిములు మంచి ఆలోచన చేయాలని, కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 1.8శాతమేనని, ప్రస్తుత సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ 8శాతం ఓట్లతో ముందంజలో ఉన్నదని, ఫలితాలు తారుమారవుతాయని చెప్పారు. కష్టపడి పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పోచారం ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, మహ్మద్ ఎజాస్, అమేర్ చాహూస్, మైనార్టీ ఫంక్షన్ హాల్ అధ్యక్షుడు వాహాబ్, కొర్ల పోతురెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

