Pothangal | పోతంగల్, పిబ్రవరి 12 : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు మానుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. పోతంగల్ మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకుంటున్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడికి మద్దతు తెలపకుండా ప్రత్యర్థులతో చేతులు కలపడం ఏంటని వారు ప్రశ్నించారు.
ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు మానుకోవాలని హితవు పలికారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా సొంత బలం నిరూపించుకోవడానికి కాసులు బాలరాజుపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన తీరును వారు తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో ఏంసీ చైర్మన్ హన్మంతు, నాయకులు గంధపు పవన్, ఎజాజ్ ఖాన్, నిరడి గంగాధర్, గంట్ల విఠల్, కేశ వీరేశం, గంధపు రాజు, మన్సూర్, నాభి, శ్రీనివాస్ రావు, దాన్ రాజ్, సాయిలు, కాలిక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.