జహీరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం బిచ్కుందలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.