కంఠేశ్వర్, అక్టోబర్ 19: అనాథ బాలికల అభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తూ, వారికి అండగా నిలుద్దామని జిల్లా ప్రధాన న్యా యమూర్తి కుంచాల సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అనాథ బాలికల విద్యాభివృద్ధి కోసం ‘భవిష్య జ్యోతి ట్రస్ట్’ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు భవనాల సముదాయంలోని సమావేశపు హాలులో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగనేవార్, రెండో అదనపు న్యాయమూర్తి శ్రీనివాసులతో కలిసి హాజరయ్యా రు. ట్రస్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ట్రస్ట్ పేరిట ప్రత్యేకంగా ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్‌ను తెరిచామని తెలిపారు. దాతలు తమ విరాళాలను భవి ష్య జ్యోతి అకౌంట్ నెం. 35470500 1646 (ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఐసీఐసీ 003547) లో జమచేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ కమాండెంట్ రోహిని ప్రియదర్శన్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి శ్రీకాంత్‌బాబు, అనాథ బాలికలు, బాలభవన్ ఉపాధ్యాయులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనాథ బాలికల విద్యాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తున్న కాకతీయ , రవి, నిర్మలహృదయ పాఠశాల యాజమాన్యాలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.