బాన్సువాడ దవాఖానలో ఐదుగురు బాలింతలకు అస్వస్థత
పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించారు. దవాఖానలో శుక్ర, శనివారాల్లో పది మంది బాలింతలకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు.
- నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలింపు
- సిజేరియన్ వికటించడమే కారణం!
- విచారణ చేపడుతున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడి
- ఆందోళనలో బాధిత కుటుంబాలు
బాన్సువాడ, జూలై 13: పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించారు. దవాఖానలో శుక్ర, శనివారాల్లో పది మంది బాలింతలకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు.
ఇందులో ఎల్లారెడ్డికి చెందిన ఉమేర ఫాతీమా, బాన్సువాడకు చెందిన లక్ష్మీప్రియ, పిట్లం మండలం బండాపల్లికి చెందిన సునీత, గాంధారికి చెందిన జ్యోతి, బాన్సువాడ మండలంలోని కొత్తాబాదీకి చెందిన రుక్సానా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ప్లేట్ లేట్ కౌంట్స్ పడిపోవడం, రక్త స్రావం జరగడంతో హుటాహుటిన దవాఖాన సిబ్బంది నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ నెల 10న ఉమేర ఫాతీమా, లక్ష్మీప్రియ, 11న సునీత, రుక్సానా, జ్యోతికి సిజేరియన్ చేయగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వీరిలో ఉమేర ఫాతీమా, జ్యోతి , రుక్సానా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు. సిజేరియన్ అయిన పది మందిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బాధిత కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్‌భాస్కర్‌ను వివరణ కోరగా, పది మందికి సిజేరియన్ జరిగింది వాస్తవమేనని, అందులో ఐదుగురు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సీజేరియన్ చేసిన అపరేషన్ థియేటర్‌ను పరిశీలించామని, అందులో ఉన్న మందులను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు.
ఎవరు బాధ్యులు?
వైద్య సేవలు అందించడంలో మంచిపేరు తెచ్చుకున్న బాన్సువాడ ప్రభుత్వ మాతా శిశు దవాఖానలో ఐదుగురికి వైద్యం వికటించడం వెనుక కారణాలు తెలియరావడంలేదు. సిజేరియన్ అనంతరం ప్లేట్ లేట్స్ పడిపోవడం, ఇన్ఫెక్షన్ సోకడం, రక్త స్రావం, అధిక రక్తపోటు వంటి కారణాలకు ఎవరు బాధ్యులో తేలాల్సి ఉన్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

