వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శరత్ దంపతులకు పుట్టిన చిన్నారి వారం వ్యవధిలోనే అరుదైన వ్యాధితో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది అని వైద్యుల తెలిపారు. శరత్‌ది నిరుపేదలకు కుటుంబం కావడం వల్ల వైద్యం చేయించడం కష్టంగా మారడంతో ఎవరైనా సహాయం చేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని సోషల్ మీడియా వేదికగా చిన్నారి తల్లిదండ్రులు వేడుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వేల్పూర్‌కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా చిన్నారికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. చిన్నారికి సోకిన జబ్బుకు వైద్యం కోసం రూ.5 నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ముందుకు వారికి అండగా నిలువాలని వని హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.