Nizamabad | ఎస్ఐఆర్ అమలులో పనితీరు భేష్.. నిజామాబాద్ అధికారులను అభినందించిన రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి
ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు భేషుగ్గా ఉందని తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి కితాబిచ్చారు.
- ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష
- క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన
Nizamabad | నిజామాబాద్, నవంబర్ 26 : ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు భేషుగ్గా ఉందని తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి కితాబిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ పర్యవేక్షణలో బీఎల్ఓలు మొదలుకుని ఈఆర్ఓల స్థాయి వరకు ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించారని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో నిర్వహించిన ఎస్ఐఆర్ అమలు తీరుపై గురువారం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియ అమలు తీరు గురించి కలెక్టర్ ఇలా త్రిపాఠి అడిషనల్ సీఈఓ దృష్టికి తెచ్చారు.
ఒక్కో నియోజకవర్గం వారీగా ఈఆర్ఓలకు ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటూ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డిలీటెడ్) జాబితా రూపకల్పనలో పాటించిన మార్గదర్శకాలు, అనుసరించిన పద్ధతుల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ షెడ్యుల్ కు అనుగుణంగా పక్కాగా ఈ ప్రక్రియను నిర్వహించారని అన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం మరికొంత గడువును పొడిగించిన దృష్ట్యా, ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ ఏఎస్‌డీడీ జాబితాను మరింత క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయికి వెళ్లి ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్న ఒక్కో ఓటరు వారీగా పునఃపరిశీలన జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు గుర్తిస్తే, తక్షణమే దానిని సరి చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు సైతం ఓటరు జాబితా నుండి తొలగించబడకూడదని, అదే సమయంలో అనర్హులైన వారి పేర్లు జాబితాలో ఉండరాదని స్పష్టం చేశారు.
ఓటరు తుది జాబితా ప్రకటన తరువాత జాబితాలో తమ పేరు లేదని అర్హులైన వారి నుండి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఉండకూడదని అన్నారు. ప్రధానంగా ఆబ్సెంట్, షిఫ్ టెడ్ కేసుల విషయంలో నిశిత పరిశీలన జరపాలని హితవు పలికారు. ఏఎస్‌డీడీ జాబితా రూపకల్పన సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో క్రియాశీలకమని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఏఎస్‌డీడీ జాబితాలో బీఎల్ఏ ల సంతకాలు తీసుకోవాలని తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఒక్కటే ఓటు ఉండాలన్న లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఒకటి కంటే ఎక్కువగా ఓట్లు కలిగి ఉండడం నేరంగా పరిగణించబడుతుందని, అలాంటి వారు శిక్షార్హులు అవుతారని అన్నారు. ఏ విషయాన్ని ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించిన ఫలితంగా రాష్ట్రంలో డబుల్ ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగించబడ్డాయని తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా ఏఎస్‌డీడీ జాబితాలో 2.11 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయని చెప్పారు. అయితే వీరిలో ఇంకనూ ఎవరైనా అర్హులు ఉన్నారా అన్నది నిర్ణీత గడువు లోపు మరోమారు క్షుణ్ణంగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ పీ సురేష్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్, బాన్సువాడ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయకుమారి, రవీందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
SP Ashok Kumar | కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి : ఎస్పీ అశోక్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

