స్ట్రాంగ్ రూమ్‌లకు చేరిన ఈవీఎంలు
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు.
కంఠేశ్వర్, మే 14: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. నియోజకవర్గాల వారీగా క్రమపద్ధతిలో అమర్చారు. మంగళవారం ఉదయం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలీస్ వజ్ ఆర్తోపాటు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేశారు. రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌లు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంలతోపాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, సీపీ అధికారులకు సూచనలు చేశారు. జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వారి వెంట ట్రైనీ కలెక్టర్ సంకేత్‌కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

