Prajavani | ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారుల డుమ్మా.. అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
- అటెండెన్స్ తీసుకోవాలని ఆదేశం
Prajavani | కంటేశ్వర్, ఆగస్టు 11 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొట్టడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజావాణిలో 83 ఫిర్యాదులు అందగా సంబంధిత శాఖ అధికారులను ఫిర్యాదులు పరిశీలించి త్వరితగతన సమస్యను తీర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు రాకపోవడం గమనించిన కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యతను అధికారులు గుర్తించాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమానికి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని, జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రతీ సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లా అధికారులు కచ్చితంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ముందుగానే తెలియజేయాలని సూచించారు.
అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్వాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

