గుక్కెడు నీటికీ కటకట..
ప్రభుత్వ పాఠశాలలో నీటి ఇబ్బందులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగిన ఘటన ఎడపల్లి మండలం ఠాణాకలాన్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 రోజులుగా తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకునేందు కు నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
ఎడపల్లి, జూలై 2: ప్రభుత్వ పాఠశాలలో నీటి ఇబ్బందులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగిన ఘటన ఎడపల్లి మం డలం ఠాణాకలాన్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 రోజులు గా తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకునేందు కు నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకొని హెచ్ఎం నరేందర్తో వాదనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోనే వాటర్ట్యాంక్ ఉండి అండర్గ్రౌండ్ పైపుల ద్వారా నీటి సరఫరా అయ్యేదని, పైపులన్నీ మట్టితో జామ్ అవ్వడంతో 15రోజులుగా నీటి సరఫరా లేదన్నారు. దీంతో విద్యార్థులు తాగడానికి ఇంటి నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారని తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని, పాఠశాల పక్కనే ప్రధాన రోడ్డు ఉండడంతో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పాల్దా భాస్కర్ రెడ్డి పాఠశాలకు చేరుకొని తల్లిదండ్రులను శాంతింపజేశారు. ఈ విషయమై ఎంఈవో రామారావును హెచ్ఎం సంప్రదించగా రేపటిలోగా నీటి సరఫరా మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

