విద్యాశాఖలో లొల్లి
ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిని వదిలి జగడం సృష్టిస్తున్నారు.
- డీఈవో వర్సెస్ ఉపాధ్యాయులు
- బజారు పాలవుతున్న విద్యాశాఖ తీరు
నిజామాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిని వదిలి జగడం సృష్టిస్తున్నారు. ఉద్యోగ ధర్మాన్ని వదిలి నిత్యం కొట్లాటలతో రచ్చ కెక్కుతున్నారు. డీఈవోతోనే పోరు సాగిస్తూ కొంతమంది ఉపాధ్యాయులు చెడ్డ పేరును తెచ్చుకుంటుండగా…
పంతుళ్లతో ఘర్షణకు దిగుతూ డీఈవో స్థాయి వ్యక్తే ఠాణా వరకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీ వ్యవహారాల్లో ఈ తతంగం మరింత ముదరడంతో విద్యాశాఖ పరువు బజారు పాలైంది. వృత్తి ధర్మాన్ని మరిచి పైస్థాయి అధికారితో కొంతమంది ఉపాధ్యాయ సంఘాల పేరుతో దురుసుగా, కటువుగా వ్యవహరించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. టీచర్లతో ఘర్షణకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఈవో తీరు రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీసింది.
ప్రజాపాలనలో వైచిత్రి..
రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు దాపురించాయి. ఇందుకు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఉదంతమే మచ్చుకు ఉదాహారణగా నిలుస్తున్నది. సమీకృత కలెక్టరేట్లో కొలువుదీరిన విద్యాశాఖపై ఉన్నతాధికారుల నియంత్రణ కూడా లేకపోవడమూ కారణమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బదిలీలను చేపడుతుండగా నిజామాబాద్ జిల్లాలో ఈ తంతు మాయని మచ్చగా మారుతున్నది. విద్యాశాఖలో రిలీవింగ్ ఆర్డర్లకు ఎంఈవోలు డబ్బులు వసూలు చేయడం, సీనియారిటీలో లోపాలు అడుగడుగునా బహిర్గతమవుతున్నా.. కాంగ్రెస్ పాలకులు దృష్టి సారించడం లేదు. దీంతో విద్యాశాఖలో వ్యవస్థ కుప్పకూలినట్లయ్యింది. అందుకే గతంలో ఎక్కడా, ఎప్పుడూ జరగని విధంగా వేధింపుల పేరిట ఏకంగా డీఈవో టీచర్లపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
దొందూ దొందే..
ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖలో ప్రస్తుతం దొందూ దొందే అన్నట్లుగా పరిపాలన నడుస్తున్నది. ఓ వైపు విద్యాశాఖ అధికారులు, మరోవైపు ఉపాధ్యాయ సంఘాల్లోని కొంతమంది నాయకుల తీరు ఇందుకు కారణంగా మారుతున్నది. టీచర్ల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాటం చేయాల్సిన వారు ఉన్నతాధికారులకు వంత పాడుతుండడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సమస్యలపై ఎవరైనా గళం విప్పితే ఒంటిగా చేసి టార్గెట్ చేస్తున్న ఘటనలు కూడా ఉభయ జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. బదిలీ వ్యవహారాల్లో కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఎంఈవోలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది నాయకుల పాత్రను తీసి పారేయలేం అంటూ బాహాటంగానే టీచర్లు వాపోతున్నారు.
వెలుగులోకి డీఈవో ఫిర్యాదు..
ఖలీల్వాడి, జూలై 18: కొంతమంది ఉపాధ్యాయులు తనను మానసికంగా వేధిస్తున్నారని డీఈవో దుర్గాప్రసాద్ ఈ నెల 1న రూరల్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు గురువారం వెలుగులోకి వచ్చింది. విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్, రావుట్ల ఉపాధ్యాయుడు బాలయ్య, వెల్మల్ ఉపాధ్యాయుడు ఓమాజీ తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని డీఈవో పేర్కొన్నారు. తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, ప్రతి విషయానికి కార్యాలయంలోకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీంతో తన కుటుంబసభ్యులు సైతం ఒత్తిడికి గురవుతున్నారని, వారి ఒత్తిడి తట్టుకోలేక ఫిర్యాదు చేసినట్లు డీఈవో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఈవో ఫిర్యాదుపై రూరల్ ఎస్సై మహేశ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

