సారుతోనే..పవర్‌పుల్
సమైక్య రాష్ట్రంలో కరెంటు గోసలు పడ్డాం.. రోజంతా నాలుగు గంటల కరెంటు ఉంటే అదృష్టంగా భావించేవాళ్లం.. కరెంటు ఉంటేనే చేసే పనులు లేక ఇంట్లో అందరం పస్తులుండాల్సిన పరిస్థితి ఉండె. అట్లాంటి గడ్డుకాలాన్ని మరిపించేలా తయారుజేసిండు కేసీఆర్ సారు.
- నిరంతర కరెంటుకు కేరాఫ్ కేసీఆర్
- కోతల్లేని విద్యుత్ సరఫరా.. కుటీర పరిశ్రమలకు భరోసా
- కరెంటు కష్టాలు తీర్చిన ఘనత గులాబీ బాస్‌దే..
- 24గంటల కరెంటుతో రంది లేకుండా జీవనోపాధి
సమైక్య రాష్ట్రంలో కరెంటు గోసలు పడ్డాం.. రోజంతా నాలుగు గంటల కరెంటు ఉంటే అదృష్టంగా భావించేవాళ్లం.. కరెంటు ఉంటేనే చేసే పనులు లేక ఇంట్లో అందరం పస్తులుండాల్సిన పరిస్థితి ఉండె. అట్లాంటి గడ్డుకాలాన్ని మరిపించేలా తయారుజేసిండు కేసీఆర్ సారు. తెలంగాణ అచ్చినంక సీఎం అయిన కేసీఆర్.. ఫస్టు కరెంటును మంచిగ జేసిండు. 24గంటలు కరెంటు కోతలు లేకుండా చూసిండు. మా జీవితాల్లో వెలుగులు నింపిండు. విద్యుత్తు వ్యవస్థను సమూలంగా మార్పులు చేసి పవర్ఫుల్ తెలంగాణగా తీర్చిదిద్దిండు. అలాంటి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూడడం సబబు కాదు. చేతనైతే అంతకన్నా మెరుగ్గా కరెంటు సరఫరా చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ టైంలనే కరెంటు బాగున్నది..
శక్కర్‌నగర్, జూన్ 20: ఆంధ్రోళ్ల పాలనలో ఉన్నప్పుడు కరెంటు సక్కగ ఉండకపోతుండె. ఇష్టమొచ్చినప్పుడు వస్తుండె. పని చేసుకుందామంటే కుదరకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ ఎట్ల జేసిండో.. ఏం జేసిండో కానీ కరెంటు అయితే మస్తుగా వస్తుండె. కరెంటు కటకట లేకుంటా ఉండేది. దీంతో మా పిండిగిర్నీ మంచిగ నడిచింది. ప్రజలు ఎప్పుడు వచ్చినా వెంటనే మర ఆడించి ఇచ్చేటోళ్లం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరెంటు సరఫరా సక్రమంగా అందడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిల్‌ను కొనసాగించాం.
– సయ్యద్ అక్బర్ అలీ, ఫ్లోర్ మిల్ యజమాని, ఎడపల్లి
చేతినిండా పనిఉండేది..
పదేండ్లకు ముందు రోజుకు నాలుగు గంటలు మాత్రమే కరెంటు ఉండేది. అది కూడా రెండుసార్లు వచ్చేది. మిగిలిన టైంల ఖాళీగా కూసునేటోళ్లం. కేసీఆర్ సారు సీఎం అయిన తర్వాత కరెంటు పోతదనే ఆలోచన లేకుండా తయారుజేసిండు. సారు సీఎంగా ఉన్నన్ని రోజులు నేను చేస్తున్న కార్ డెంటింగ్, పెయింటింగ్ పనులు చురుగ్గా సాగాయి. రోజూ చేతినిండా పనిఉండేది. కరెంటు మంచిగ వచ్చేటట్లు చేసిన కేసీఆర్ సారుపై నిందలేయడం మంచిది కాదు.
– షేక్ అయూబ్, కార్ డెంటింగ్, పెయింటర్, బోధన్.
పదేండ్ల కిందటి రోజులొచ్చినయ్..
కరెంటు ఎప్పుడుపడితే అప్పుడు పోతున్నది. తెలంగాణ రాకముందు ఎట్ల ఉండెనో ఇప్పుడు కూడా అదే లెక్క తయారైంది. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కరెంటును బాగుజేసిండు. కరెంటు పోతదనే ముచ్చట లేకుండా జేసిండు. నేను బైక్‌లు రిపేర్ చేయడానికి కరెంటు కచ్చితంగా కావాలె. పదేండ్లల్ల్ల దినమంతా కరెంటు ఉండుట్ల పనులు ఆగకపోతుండె. ఒక్కటే రోజు రెండు బైక్‌ల ఇంజిన్లు రిపేర్ చేసేవాడిని. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ కరెంటు ఇచ్చిండు.
– షేక్ ఇమ్రాన్, బైక్ మెకానిక్, బోధన్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

