Collector Vinay Krishna Reddy | ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరామర్శ
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Collector Vinay Krishna Reddy | ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుజ్జమ్మను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆమెను ఆసుపత్రి వర్గాలు సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్, వృద్ధురాలు బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అయితే తమ స్వస్థలమైన పెర్కిట్ కు చేరువలో ఉన్న ఆర్మూర్ లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ దూరపు బంధువులు చెప్పడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్ కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

