Velpuru | వేల్పూర్ : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల్పూర్ మండలంలోని కప్పల వాగు, పెద్దవాగులకు వరద నీరు చేరుతోంది. దీంతో వాగులపై ఉన్న చెక్ డ్యామ్ లో పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరద నీరు వాగులలోకి చేరడంతో వాగులకు జలకళ సంతరించుకుంది.
వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందిన రైతులు గత రెండు రోజుల నుండి కురుస్తున్న వానలతో ఆనందం వ్యక్తం చేశారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల తమ పంటలకు కొద్ది మేరకు ఇబ్బందులు తొలగిపోయాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు వాగులకు చేరడంతో వాగులపై ఉన్న చెక్ డ్యాములపై నుండి వరద నీరు ప్రవహించడం వల్ల వాగుల వెంట ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని పలువురు పేర్కొంటున్నారు.