తాటిముంజలు తక్షిణ శక్తి
వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటిముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజలోపల తియ్యని నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ యాపిల్ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ. వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే తాటిముంజలపై ప్రత్యేక కథనం..
- ఎండవేడిమి నుంచి ఉపశమమిచ్చే ఐస్ యాపిల్స్
- చలువతోపాటు ఆరోగ్యానికి మేలు
- డజన్ రూ.100 నుంచి రూ.120కు విక్రయం
వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటిముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజలోపల తియ్యని నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ యాపిల్ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ. వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే తాటిముంజలపై ప్రత్యేక కథనం..
– ఎల్లారెడ్డి రూరల్, మే 19
భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు ఏమేరకు మేలు చేస్తాయో చెప్పలేం కానీ, ఎండకాలంలో లభించే తాటిముంజలు మాత్రం ఆరోగ్యంతోపాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. తాటిముంజల్లో ఉండే పోషకాలు వేసవి వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తూ పలు అనారోగ్య సమస్యలకు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. మండు వేసవిలో మాత్రమే ఈ ఐస్ యాపిల్స్ లభించడం విశేషం.
డజన్ లెక్కన..
తాటిముంజలను ఇష్టపడని వారుండరు. ఎండకాలం వచ్చిందంటే చాలు రోడ్డు పక్కన తాటిముంజలను విక్రయిస్తుంటారు. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. గ్రామాల నుంచి తీసుకువచ్చి వీటిని విక్రయిస్తారు. పట్టణాల్లో డజన్ తాటిముంజలు రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. తాటిముంజల్లో నీటిశాతం అధికంగా ఉంటుంది. వేసవిలో నాలుగు ముంజలు తింటే డీహైడ్రేషన్ నుంచి విముక్తి కలుగుతుంది. ముంజలను చిన్న ముక్కలుగా కోసి స్వీట్లు, లస్సీ, జ్యూస్, సలాడ్లతోపాటు చికెన్, మటన్‌లో వేసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బీ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాటిముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది. సీజనల్‌గా లభించే పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
తాటిముంజల్లో లభించే పోషకాలు..
- విటమిన్ బీ-7, విటమిన్ కే, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-డీ, జింక్, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్ ఉంటాయి.
- పొటాషియం సమృద్ధిగా ఉండడంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ్యాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
- వేసవిలో లభించే తాటిముంజల్ని రోజూ తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటిముంజలు తినడంతో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
- జీర్ణ సంబంధ సమస్యను తగ్గిస్తాయి. ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
- వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని అధిక బరువును తగ్గించేందుకు తాటిముంజలు ఎంతో సహాయపడతాయి.
- తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి వేసవికాలంలో వచ్చే చెమటకాయని నివారిస్తుంది. అలాగే ఎండవేడిమితో ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

