కేటీఆర్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నించారు.
- వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు?
- బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం
ఖలీల్‌వాడి, అక్టోబర్ 27: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ ఏదో జరిగితే అది కేటీఆర్‌కు ఏం సంబంధమని పేర్కొన్నారు.
రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, వారి ఇండ్లపై పోలీసులు రైడ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. స్వయంగా పోలీసులే రేవంత్‌రెడ్డి సోదరుడితో సెటిల్మెంట్ చేసుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. చిల్లర దాడులు తమను భయపెట్టవని, తమకు అరెస్టులు కొత్తకాదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష నేతగా ప్రజల్లో కేటీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోవడంలేదన్నారు. ప్రజాగొంతుకైన కేటీఆర్‌కు సమాధానం చెప్పలేక చిల్లర వేషాలు వేస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్‌ను ప్రజలే రక్షించుకుంటారని తెలిపారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్ చరిష్మా తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో గృహ ప్రవేశాలకు దావత్‌లు జరగడం సర్వ సాధారణమని, మంత్రులే పట్టపగలు తాగి తిరుగుతున్నారని ఆరోపించారు. వారికి పరీక్షలు చేస్తారా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. చట్ట పరిధిలో పని చేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇది కక్ష సాధింపు చర్య..
- మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడి చేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్ను దెబ్బతీసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదని పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

