అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది. విద్యుత్, వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి.. కేసీఆర్ కార్యదక్షతను సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నవభారత నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నివర్గాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. మతోన్మాద పార్టీల మెడలు వంచి.. దేశమంతా సామరస్యం వర్ధిల్లేలా చేసే సత్తా కేసీఆర్‌కే ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. యావత్ దేశానికి తెలంగాణ మోడల్ కావాలని అంగన్వాడీ టీచర్లు ఆకాంక్షిస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. సుపరిపాలకుడైన కేసీఆర్ రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ర్టాలకూ అవసరమని, ఆయన ప్రధాని అయితే వ్యవసాయం సహా అన్నిరంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తుందని, సంక్షేమ ఫలాలు యావత్ జాతికి దక్కుతాయని పేర్కొంటున్నారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 25 : తరతరాలుగా పాలిస్తున్న జాతీయ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదు. ఇక ముందు కూడా ఏమీ ఉండదు. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలింది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నా.. త్వరగా అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన చేరాలన్నా తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని సర్వత్రా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. మార్గనిర్దేశం చేసే నాయకుడి కోసం దేశం ఎదురుచూస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే.. దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అంగన్వాడీ టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
పాలనా దక్షత కలిగిన నేత కేసీఆర్
ఉద్యమనేతగా విజయం సాధించిన కేసీఆర్ మంచి పాలనా దక్షత కలిగిన నేతగా రాణించారు. సీఎంగా తెలంగాణ రాష్ర్టాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. అలాంటి పరిపాలనా దక్షత కలిగిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశరాజకీయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ సమయంలో జాతీయ రాజకీయాలను మార్చగల ఏకైక వ్యక్తి కేసీఆరే.
– వనజ, అంగన్వాడీ టీచర్, తిర్మన్‌పల్లి
తెలంగాణ లెక్క దేశం అభివృద్ధిగావాలె..
అంగన్వాడీ స్కూళ్లల్లో పిల్లలను బాగా చూసుకోవాలని అందరూ చెబుతారు. పిల్లలను చూసుకునే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కడుపునిండా జీతంతో బతకాలని కేసీఆర్ ఒక్కరే ఆలోచించారు. అందుకే మాకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు అందుతున్నాయి. మాకే కాదు.. బీడీ కార్మికులు, వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నరు. మాటలు చెప్పేనాయకుడు కాదు. ప్రజల అవసరాలను చూసి పథకాలను రూపొందించే మనసున్న నేత కేసీఆర్. కేసీఆర్ సీఎం అయినంక రాష్ట్రంలో అన్నివర్గాల గురించి ఆలోచన చేసిండు. దేశానికి కూడా ఇసొంటి నాయకుడు కావాలి.
– రుక్మిణీ, అంగన్వాడీ టీచర్, ఖానాపూర్
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తెలంగాణలో అన్నివర్గాల వారికి వెన్నుదన్నుగా ఉన్నాడు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని బడుగు బలహీన వర్గాల జీవితాలు మారతా యి. ప్రస్తుతం దేశంలో తెలంగాణ ఏవిధంగా అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం సైతం ప్రపంచంలో అభివృద్ధికి కేరాఫ్‌గా మారుతుంది.
– లక్ష్మి, అంగన్వాడీ టీచర్, ధర్పల్లి
గౌరవ వేతనాన్ని పెంచారు
తెలంగాణలోని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలను పెంచి ఆదుకున్నాడు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణలో చేస్తున్న సంక్షేమ పథకాలను దేశమంతా అమలు చేస్తే మిగతా రాష్ర్టాల్లోని అంగన్వాడీలు, ఉద్యోగులు, రైతులు.. అందరూ బాగుపడతారు. విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి.
– తాడెం శోభ, అంగన్వాడీ టీచర్, ఇందల్వాయి
ప్రజల నాడి తెలిసిన వ్యక్తి..
తెలంగాణ మాదిరిగానే దేశం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఎన్నో ఏండ్ల కల అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. ఎనిమిదేండ్లలో ఎనలేని అభివృద్ధి చేసి చూపించారు. ప్రజల నాడి తెలిసిన వ్యక్తే జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ పరిస్థితులు సంపూర్ణంగా మారతాయి. తెలంగాణ ప్రజలతోపాటు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ జాతీయ రాజకీయాల అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
– మాధవి, అంగన్వాడీ టీచర్, ధర్పల్లి
అందరి మెప్పు పొందిన నేత ..
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్. ఆయన సేవలు దేశానికి అవసరం. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి.. అందరి మెప్పు పొందిన నేత. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన చేస్తున్న అభివృద్ధి.. జాతీయ రాజకీయాలకు వెళ్తే దేశం కోసం కూడా చేస్తారు.
– మలావత్ సరిత, అంగన్వాడీ టీచర్, పందిమడుగు
అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట
తెలంగాణను సాధించి అనతి కాలంలోనే దేశంలోనే నెంబ ర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ముందుండాలి. కేసీఆర్‌తోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మెజార్టీ దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– తేలు శ్రీలత, అంగన్వాడీ టీచర్, మిట్టపల్లి
అప్నే తెలంగాణకా స్కీమ్ పూరా దేశ్‌కో చాహియే…
తెలంగాణమే అమల్ హోరేసే పూరా స్కీమ్ దేశ్‌కో హోనా చాహియే. ఉస్ లీయే కేసీఆర్ సాబ్‌నే సెంట్రల్‌కు గయేతో దేశ్‌మే పూరా ఆద్మీకో అప్నే స్కీమ్ పూరా ఫాయిదా మిల్తా. తెలంగాణామే పూరా లోగ్ కేసీఆర్ సాబ్ అమల్ కరేసో స్కీమ్ పూరా దేశ్ మే అమల్ కరేతో దేశ్‌మే పూరా లోగ్ ఖుష్ రహేంగే. ఆజ్ తక్ తెలంగాణమే షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి స్కీమ్సే గరీబ్ ఆద్మీకే ఏక్ లాక్ రూపియే కేసీఆర్ సాబ్ బడా భాయ్ కా రూప్‌మే దే రహా హై. దేశ్ కే కోయి స్టేట్ మే ఫ్రీ కరెంట్ నహీ దే రహాహై. ఇస్ లియే దేశ్‌మే కేసీఆర్ సాబ్‌నే ప్రధాని హుయేతో సబ్కో అచ్చా ఫాయిదా హోగా.
– నుస్రత్, అంగన్వాడీ టీచర్, ఘన్పూర్
రాక్షస పాలనకు చరమగీతం పాడతారు
కేంద్రంలో ఉన్న రాక్షస పాలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడతారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించ గల సామర్థ్యం ఉన్న నాయకుడిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో ఘననీయమైన అభివృద్ధి సాధించిన నేతగా చరిత్రకెక్కారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ఆయనే. దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా కేసీఆర్ ఒక్కడే కనబడుతున్నాడు. ఉద్యోగులకు జీతాల పెంపు, పీఆర్సీ, నూతన ఉద్యోగాల భర్తీ లాంటివి కేసీఆర్‌తోనే సాధ్యమైంది. కేసీఆర్ దేశానికి ఎంతో అవసరం.
– శోభ, అంగన్వాడీ టీచర్, నడిపల్లి
దేశానికి పెద్దదిక్కు అవుతారు..
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దేశానికి పెద్దదిక్కు అవుతారు. తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు చూస్తున్నారు. దేశాన్ని ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. సబ్బండవర్గాల ఆకాంక్ష మేరకు దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దూరదృష్టి ఉన్న కేసీఆర్ వ్యవస్థను మార్చగల శక్తి కలిగిన నేత. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే భావితరాలకు ఎంతో మేలు చేసే పథకాలు అమలయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు మూడుసార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.
– గాండ్ల అనిత, అంగన్వాడీ టీచర్, ఖిల్లా డిచ్పల్లి