Anganwadi Centres | కార్పొరేట్ బడులకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు.. ఆటాపాటలతో చిన్నారులకు బోధన
గోడలపై రంగురంగుల అందమైన చిత్రా లు.. ఆకట్టుకునే ఆట బొమ్మలతో అంగన్వాడీ కేంద్రాలు ప్లేస్కూళ్లను తలపిస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆటాపాటలతో చదువు కూడా అందుతున్నది.
Anganwadi Centres | గోడలపై రంగురంగుల అందమైన చిత్రా లు.. ఆకట్టుకునే ఆట బొమ్మలతో అంగన్వాడీ కేంద్రాలు ప్లేస్కూళ్లను తలపిస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆటాపాటలతో చదువు కూడా అందుతున్నది. ప్రైవేటు, కార్పొరేట్ ప్లేస్కూళ్లలో నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కల్పించే సౌకర్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోనూ సమకూర్చుతున్నది. దీంతో చిన్నారులు ఆడుతూపాడుతూ చదువుకుంటున్నారు.
అంగన్వాడీ కేంద్రాల బలోపేతం..

ఒకప్పుడు అంగన్వాడీ కేంద్రాలను పాత ఇండ్లు, కిరాయి గదుల్లో నిర్వహించేవారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా వరకు పేరుకే సెంటర్లు ఉండేవి. నిధులు లేక అరకొర వసతులతో అంగన్వాడీ సెంటర్లను నిర్వహించేవారు. అక్కడి పరిస్థితులను చూసి పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చేవారు కాదు. అలాంటి అంగన్వాడీ కేంద్రాల దశ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మాతా శిశు సంరక్షణలో భాగంగా దశల వారీగా నిధులు విడుదల చేస్తూ అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసింది. అన్ని వసతులతో పక్కా భవనాలను నిర్మించింది. గర్భిణులు, బాలింతలతోపాటు చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నది.
అన్ని రకాల సౌకర్యాలు..
ఒక్కో మండలంలో ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలను మోడల్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నారు. పక్కా భవనాలను నిర్మించారు. గోడలపై రంగురంగుల కార్టూన్లు, అక్షరాలు, పదాలు నేర్చుకునేందకు అర్థమయ్యే రీతిలో చిత్రాలను వేశారు. ఆటవస్తువులు, టెలివిజన్, బోధనా సామగ్రిని సమకూర్చారు. మరుగుదొడ్లు, ప్రహరీ, తాగునీరు, కుర్చీలు వంటి అన్ని సౌకర్యాలూ కల్పించారు.

బీర్కూర్ మండలంలో మొత్తం 25 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో బరంగేడ్గి, బైరాపూర్ గ్రామాలను మోడల్ అంగన్వాడీ సెంటర్లుగా ఎంపికయ్యాయి. ఆయా సెంటర్లలో చిన్నారులకు ప్రత్యేక భోజన హాల్, గర్బిణులు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక గది, వంటశాల ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తవులను సమకూర్చారు. కార్పొరేట్ స్థాయి ప్లేస్కూల్ మాదిరిగా సౌకర్యాలు కల్పించడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బైరాపూర్ పాఠశాలలో 25 మంది చిన్నారులు, పది మంది గర్భిణులు, బాలింతలు, బరంగేడ్గిలో 20 మంది చిన్నారులు, ఎనిమిది మంది గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ పాలు, కోడిగుడ్లతోపాటు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు.
టీచర్లకు గౌరవం పెరిగింది..

ఒకప్పుడు అంగన్వాడీ సెంటర్లలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. పిల్లలను తల్లిదండ్రులు పంపించేవారు కాదు. అంగన్వాడీ వర్కర్లుగా మాకు గుర్తింపు కూడా ఉండేదికాదు. అంగన్వాడీ సెంటర్లను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్లే స్కూళ్ల మాదిరిగా తీర్చిదిద్దడంతో పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు. మాకు కూడా సమాజంలో గౌరవం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
-సుమలత, అంగన్వాడీ టీచర్, బైరాపూర్
ప్రభుత్వ సహకారం బాగుంది..

అంగన్వాడీ కేంద్రాలకు అప్పటి ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి కాదు. మేము ఎంత కష్టపడ్డా ఫలితం ఉండేది కాదు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధికి కావాల్సినన్ని నిధులు ఇస్తున్నారు. ప్రభుత్వ సహకారం బాగుంది. మోడల్ అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. మరో విడుతలో బీర్కూర్ మండలంలో మరిన్ని గ్రామాలను మోడల్ కేంద్రాల ఎంపికకు ప్రతిపాదనలు పంపుతాం.
-కళావతి, సీడీపీవో, బాన్సువాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

