గంటన్నర.. నరకయాతన
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కోటగల్లీలో ఉన్న లావణ్య ఆర్కేడ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ ప్రత్యేక టీం సహాయంతో ప్రాణాపాయ స్థితి నుం చి బయటపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
- లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డు
- తీవ్రంగా శ్రమించి బయటికి తీసిన రెస్క్యూ టీమ్
వినాయక్‌నగర్, జనవరి 17: నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కోటగల్లీలో ఉన్న లావణ్య ఆర్కేడ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ ప్రత్యేక టీం సహాయంతో ప్రాణాపాయ స్థితి నుం చి బయటపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. లావణ్య ఆర్కేడ్ కాంప్లెక్స్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మహేందర్‌గౌడ్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం లిప్టులో పైఅంతస్తు నుంచి కిందికి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్లో కాలు బయటపెట్టే సమయంలో లిఫ్ట్ కొంతపైకి వెళ్లి ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అతడి కాళ్లు రెండు బయట ఉండగా.. మోకాలి పైభాగం మొత్తం లిఫ్టులో ఇరుక్కుపోయింది. మహేందర్ గౌడ్ కేకలు వేయగా.. చుట్టుపక్కల ఉన్నవారు గుమిగూడారు.
హైదరాబాద్ ఫైర్ డిపార్ట్మెంట్కు ఈ విషయం తెలియజేయగా.. జిల్లాకేంద్రంలోని ఫైర్ రెస్క్యూ బృందానికి వారు సమాచారం ఇచ్చారు. ఫైర్ రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని.. సుమారు అరగంటపాటు శ్రమించి, లిఫ్ట్ ఒక భాగాన్ని యంత్రంతో కోసి సెక్యూరిటీ గార్డును బయటికి తీశారు. గంటపాటు ప్రాణభయంతో లిఫ్ట్‌లో బిక్కుబిక్కుమంటూ ఉన్న మహేందర్ ప్రాణాలతో బయటపడడంతో అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపడుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

