బిచ్కుంద, ఆగస్టు 24: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లాకే గర్వకారణమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అని అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్ ఇవ్వడం సంతోషకరమైన విషయమని అన్నారు. న్యాక్ బృందం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కళాశాలకు రాన్నున రోజుల్లో పీజీ కోర్సులు మంజూరవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో 6 మండలాలకు చెందిన విద్యార్థులు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొంది బాగా చదవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రముఖర్జి, ఎంపీపీ అశోక్‌పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, రైతు బంధు సమితి కన్వీనర్ బస్వరాజ్ పటేల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ
మండల కేంద్రంలో మైనారిటీల శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే హన్మంత్‌షిండే భూమిపూజ చేశారు. మైనారిటీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని వినతి
పిట్లం, ఆగస్టు 24: మండలంలోని అల్లాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం మంజూరుకు కృషి చేయాలని సర్పంచ్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే హన్మంత్షిండేను కోరాను. బుధవారం పెద్దకొడప్గల్ వెళ్తున్న ఎమ్మెల్యే మార్గమధ్యంలో అల్లాపూర్‌లో ఆగి టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు. గ్రామానికి అవసరమున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ కవితా విజయ్, పార్టీ పెద్దకొడప్గల్ మండల అధ్యక్షుడు విజయ్దేశాయ్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు అంబరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాములు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.