ఖలీల్‌వాడి, జనవరి 9 : విదేశాల్లో నియామకాలను సులభతరం చేసేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని ఐటీఐ కళాశాలలో మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. టాంకాం, రిజిస్ట్రర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది.
యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులను అందజేశారు. మొత్తం 800మంది వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇజ్రాయెల్ దేశంలో భవన నిర్మాణ కార్మికులు, షట్టరింగ్ కార్పెంటర్లు, సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ పనులు కల్పించేందుకు జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.