బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 13, 2021 , 00:43:50

కబడ్డీ టోర్నీ విజేత మహ్మదాబాద్‌ జట్టు

కబడ్డీ టోర్నీ విజేత మహ్మదాబాద్‌ జట్టు

కోటగిరి, జనవరి 12: స్వామి వివేకానంద జయంతి, సంక్రాంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో నిర్వహించిన కబడ్డీ టోర్నీ ముగిసింది. విన్నర్‌గా మహ్మదాబాద్‌, రన్నర్‌గా పొతంగల్‌ జట్లు నిలిచాయి. మంగళవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి హాజరై విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతులను అందజేశారు. టోర్నీ నిర్వాహకులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, నీరడి గంగాధర్‌, విండో చైర్మన్‌ కూచి సిద్ధ్దు, సిరాజ్‌, ఎజాజ్‌ఖాన్‌, బర్ల మధు, పీఈటీలు సాయిబాబా,  స్వామికుమార్‌, బీర్కూర్‌ సంతోష్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo