గురువారం 28 మే 2020
Nizamabad - Apr 21, 2020 , 02:41:41

ఒకే కుటుంబంలో 8 మందికి..

ఒకే కుటుంబంలో 8 మందికి..

  • ఐదేండ్ల చిన్నారికీ కరోనా పాజిటివ్‌
  • తాజాగా మరో ఐదు కేసులు..
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 19కి చేరిన కేసుల సంఖ్య

ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందికి కరోనా సోకింది. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారినుంచి సెకండరీ కాంటాక్టు కింద పట్టణంలోని ముగ్గురు యువకులకు నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. వీరంతా కుటుంబంతో కలిసి ఉండడంతో మరో ఐదుగురికి సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రార్థనలకు జిల్లా నుంచి 76 మంది వెళ్ల గా.. వీరిలో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరికి సంబంధించి 126 మందికి ప్రైమరీ కాంటాక్టు కింద పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి మాత్రమే కరో నా సోకినట్లు తేలింది. సెకండరీ కాంటాక్టు కింద 200 మంది శాంపిల్స్‌ సేకరించిన అధికారులు పరీక్షలకు పం పగా.. ఇందులో పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌కు చెం దిన ముగ్గురు అన్నదమ్ములకు కరోనా పాజిటివ్‌గా తే లింది. వీరితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న 97 మందిని గుర్తించిన అధికారులు.. రక్త నమునాలను సేకరించా రు. ఇందులో వారి కుటుంబంలోనే ఐదుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కుటుంబంలోని వృ ద్ధురాలు (80), యువకుడి తండ్రి (62), తల్లి (57), కుటుంబంలోని ఓ మహిళ (35), మరో చిన్నారి (5)కి పాజిటివ్‌ నిర్ధ్దారణ అయ్యింది. వీరిని మె రుగైన చికిత్స కోసం వారిని గాంధీ వైద్యశాలకు తరలించారు.

ఇప్పటివరకు 19 పాజిటివ్‌ కేసులు..

జిల్లాలో ఇప్పటి వరకు 19 కేసులు నమోదుకాగా.. గాంధీలో చికిత్స పొందుతున్న ఐదుగురికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ చేసి హోం క్వారంటైన్‌కు పంపించారు. తాజాగా నమోదైన ఐదు కేసులతో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 19కు చేరింది. మరో 47 శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఒకే కుటుంబంలో 8 మందికి పాజిటివ్‌ రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ పోస్టల్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రాగా.. ప్రైమరీ కాంటాక్టులో భాగంగా ఉట్నూరుకు చెందిన నలుగురి శాంపిల్స్‌ను సేకరించారు.

ఐదుగురికి కరోనా నెగెటివ్‌

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌కు చెందిన నలుగురికి, పెద్దకొడప్‌గల్‌ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. సదరు వ్యక్తుల రక్త నమూనాలను పరీక్షలకు పంపగా వైద్యులు కరోనా నెగెటివ్‌గా నిర్ధారిస్తూ నివేదికలు ఇచ్చారని చెప్పారు.

కరోనాతో ఒకరి మృతి

  • రెడ్‌జోన్‌గా తానూర్‌

తానూర్‌/ముథోల్‌: నిర్మల్‌ జిల్లా తానూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ సోకి మృతి చెందినట్లు తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తానూర్‌కు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా టీబీ, ఆస్తమాతో బాధపడుతూ చికిత్స చేయించుకున్నాడు. ఈ నెల 1న నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యశాలలో చేరిన ఆయన.. 8వ తేదీన డిశ్చార్జి అయ్యాడు. సదరు వ్యక్తి ఈ నెల 18న మళ్లీ నిజామాబాద్‌ దవాఖానకు వెళ్లగా.. అక్కడి వైద్యులు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. సదరు వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అతడిని గాంధీ వైద్యశాలకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకొన్న కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఎస్పీ శశిధర్‌రాజుతో పాటు పలువురు అధికారులు తానూర్‌ను సందర్శించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. నిజామాబాద్‌ నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారని ఆరా తీశారు. వ్యక్తి సంబంధీకులైన 15 మందిని నిర్మల్‌ క్వారంటైన్‌కు తరలించారు. మృతుడి ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనాతో వ్యక్తి మృతి చెందడంతో అధికారులు తానూర్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

ఇద్దరిని క్వారంటైన్‌కు పంపిన పోలీసులు

తానూర్‌ మండలంలో ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో వారి బంధువులైన ముథోల్‌కు చెందిన ఇద్దరిని సోమవారం సాయంత్రం నిర్మల్‌ క్వారంటైన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భైంసా పట్టణంలో  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌లుగా విభజించి సోమవారం ఇంటింటికీ ఆరోగ్య సర్వే నిర్వహించారు. 


logo